ముంబైతో మ్యాచ్... కోల్‌కతా విజయలక్ష్యం 148

  • నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన ముంబై
  • చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టిన ముంబై
  • కాసేపు మ్యాచ్‌కి వర్షం అంతరాయం
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఒక దశలో 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. దీంతో బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. మధ్యలో వర్షం కూడా మ్యాచ్‌కి అంతరాయం కలిగించింది. ఆ తర్వాత గంటలోపు మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడంతో ఓవర్లలో కోత పెట్టలేదు.

ముంబై చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టింది. శివమ్ దుబే వేసిన 19వ ఓవర్లో 13 పరుగులు, కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై కోల్‌కతా ఎదుట 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. చివరలో వచ్చిన కార్బిన్ బాష్ 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సులు, మూడు ఫోర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్య 27 బంతుల్లో 26 పరుగులు, తిలక్ వర్మ 32 బంతుల్లో 20 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.

Mumbai Indians
IPL 2026
Kolkata Knight Riders
Wankhede Stadium
Corbin Bosch
Hardik Pandya
Tilak Varma
Cricket
T20
Match

More Telugu News